ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్

ఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్

అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మనీ బిల్ కావడంతో.. గవర్నర్ ఆమోదానికి పంపించింది సర్కార్.  బిల్  కు   గవర్నర్  ఆమోదం తెలపలేదు.  గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదురుచూస్తోంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలను రేపటితో ముగించాలని సర్కార్ చూస్తోంది. ఆర్టీసీ విలీన బిల్ ను  ఇవాళ కానీ రేపు గానీ వస్తే.. ఆదివారం రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ  గవర్నర్ రేపటి వరకు  ఆమోదించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తిగా మారింది.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆసంస్థలో పనిచేస్తున్న 43 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.