రోడ్డు భద్రత పై ‘ఆర్ట్’టీసీ అవేర్నెస్

రోడ్డు భద్రత పై ‘ఆర్ట్’టీసీ అవేర్నెస్

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ ‘ఆర్ట్ ఫర్ లైఫ్’ పేరుతో శనివారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ సిటీ రీజియన్ ఆర్‌‌ఎం సుధా పరిమళ ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్​లో నిర్వహించిన ఈ పోటీల్లో 58 మంది కళాకారులు పాల్గొన్నారు. 

కుంచెలతో ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ప్రాముఖ్యత, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు చిత్రించారు. - హైదరాబాద్ సిటీ, వెలుగు