వికారాబాద్, వెలుగు: రిటైర్డ్ టీజీఆర్టీసీ ఉద్యోగుల సంఘం డైరీని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, టీజీఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంగయ్య, సభ్యులు సాయన్న, జబ్బార్, నాగిరెడ్డి, మొయినుద్దీన్, ఎం.కె.రెడ్డి, లక్ష్మప్ప, వీరన్న, యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
