ఆర్టీసీకి రోజుకు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల ఆదాయం: బాజిరెడ్డి గోవర్ధన్

ఆర్టీసీకి రోజుకు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల ఆదాయం: బాజిరెడ్డి గోవర్ధన్

*  40 .. 50 బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయి
* రోజుకు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల ఆదాయం వస్తోంది
* తెలంగాణ ఆన్ ట్రాక్’ పాట ఆవిష్కరణ కార్యక్రమం


ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందని.. గతంలో 97 బస్సు డిపోలు నష్టాల్లో ఉండేవని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఇప్పుడు 40 - 50 బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. రోజుకు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల ఆదాయం వస్తోందని.. పండగ సమయాల్లో రూ. 21 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. దానికి కారణం ఆర్టీసీ ఉద్యోగులేనని తెలిపారు. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS) లో ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్టీసీపై రాము మిరియాల పాడిన పాటను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ  వి.సి.సజ్జనార్ ఆవిష్కరించారు. గతంలో రూ. 6 కోట్లు మాత్రమే వచ్చేవని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నారంటే వారు పడిన శ్రమ, సహకారమే కారణమన్నారు.

కొన్ని పాత బస్సులకు ఉన్న కలర్ పోయినా ప్రేమతో ప్రయాణీకులు బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తున్నారన్నారు. కరోనా కాలంలో ఆర్టీసీ చాలా ఇబ్బంది పడిందని చెప్పారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీఎం ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. కొంతమంది ఆర్టీసీలో ఏముందని హేళనగా మాట్లాడారని, కానీ తాను ఆర్టీసీ ప్రజల రవాణా అని సంతోషించానన్నారు. ఇది ఎంత మెరుగుపరిస్తే అంత ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో తార్నాక ఆసుపత్రి అధ్వాన్నంగా ఉండేదని..ఇప్పుడు కార్పొరేట్ తరహాలో రూపొందించామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే 200 మందికి ఇబ్బంది ఉంటే అక్కడే వైద్యం చేసేలా ఏర్పాటు చేశామన్నారు. 130 బస్సులు శబిరిమల అయ్యప్ప టెంపుల్ కి బుక్ అయినట్లు..ఇప్పటి వరు 1000 బస్సులు సంక్రాంతికి బుక్ అయ్యాయన్నారు.