అర్ధరాత్రితో ఆర్టీసీ కార్మికుల డెడ్ లైన్ క్లోజ్

అర్ధరాత్రితో ఆర్టీసీ కార్మికుల డెడ్ లైన్ క్లోజ్

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీఎం  కేసీఆర్ ఈ నెల 5(మంగళవారం) అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని గడువు పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటన తర్వాత కొందరు భయపడి డ్యూటీలోకి చేరినా… ఆ తర్వాత మనసు మార్చుకొని తిరిగి సమ్మెలో పాల్గొన్నారు. అయితే సీఎం పెట్టిన గడువు మేరకు ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తమ్మీద 208 మంది కార్మికులు విధుల్లో చేరారని అధికారులు చెబుతున్నారు. 3వ తేదీన 17 మంది, 4వ తేదీన 34 మంది, ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్టు వారు తెలిపారు.

మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్‌  చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కానీ ఆర్టీసీ జేఏసీ మాత్రం అదేమీ లెక్కచేయక తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని, తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ రెండూ తమ పంతాన్ని వీడట్లేదు. గడువు ముగిసిన తర్వాత ఏం జరగబోతుందోనని కార్మికులు, నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

RTC workers deadline close at midnight