మిమ్మల్నిబెదిరిస్తే కేసులు పెట్టండి..కార్మికులకు సీపీ సూచన

మిమ్మల్నిబెదిరిస్తే కేసులు పెట్టండి..కార్మికులకు సీపీ సూచన

విధుల్లోకి చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాచకొండ సీపీ మహేష్ భవగవత్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అప్పిల్ తో  ఆర్టీసీ కార్మికులు స్పందిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరుతున్నారు.   భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ లలో కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు భద్రతపై పుకార్లు రావడంతో సీపీ మహేష్ భగవగత్ స్పందించారు.

విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్థానికంగా ఉండే స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.