ఆర్టీసీ పీఆర్సీపై  త్వరలో గుడ్ న్యూస్ :  ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

ఆర్టీసీ పీఆర్సీపై  త్వరలో గుడ్ న్యూస్ :  ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: “ఆర్టీసీ కార్మికులు పీఆర్సీపై త్వరలో గుడ్ న్యూస్ వింటరు. సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నరు. ఆర్టీసీ భవిష్యత్ పై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో చర్చించిన. కార్మికుల ఉద్యోగ భద్రతపై కొత్త గైడ్ లైన్స్ ఖరారు చేస్తం.  ఇపుడు చిన్నచిన్న కారణాలకు జాబ్ ల నుంచి తొలగిస్తున్నరు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నరు” అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.

శుక్రవారం ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులంతా సమష్టిగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్నారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏపీ ఆర్టీసీ కార్మికులతో పోల్చుకోవద్దని, అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని  చైర్మన్ తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.  బస్ భవన్​లో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) రవీందర్, విజిలెన్స్ ఎస్పీ  సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పాల్గొన్నారు.