తెలుగు అయ్యప్ప భక్తులపై.. తమిళనాడు శ్రీరంగంలో దాడి

తెలుగు అయ్యప్ప భక్తులపై.. తమిళనాడు శ్రీరంగంలో దాడి

తమిళనాడులోని శ్రీరగం ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  అయ్యప్ప స్వామి భక్తులపై దాడి జరిగింది.  భక్తులు కేరళలోని శబరిమల చేరుకోవడానికి ముందు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే క్రమంలో తిరుచ్చి శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు.   ఆ  సమయంలో ఆలయ నిర్వాహకులు వీఐపీల పేరుతో కొందరిని ప్రత్యేక దర్శనానికి అనుమతించారు. 

వారిని ఎందుకు అలా లోపలికి పంపిస్తున్నారని అయ్యప్ప భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నించారు. భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ మొదలైంది. వెంటనే ఆలయ సెక్యూరిటీ జోక్యం చేసుకున్నారు.  చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో  ఇద్దరు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు, ఒక యాత్రికుడు రక్తస్రావంతో ఆలయం నేలపై పడిపోయాడు.  

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.  

హిందూ మతంపై విశ్వాసం లేని ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.   రంగనాథ స్వామి ఆలయ పవిత్రతను పాడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు