
వర్ధన్నపేట, (ఐనవోలు) వెలుగు : హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం లో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆకేరు వాగు నుంచి కొత్త నీరు తీసుకొచ్చి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి, చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు బిందెలతో నీళ్లను తీసుకొచ్చి వర్షాలు కురవాలని స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించారు. దేవాలయ ఆవరణలోని శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం నందు అమ్మవారిని శాకాంబరీగా వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు.
కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ వేద పారాయణదారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్ శర్మ నందన మధు శర్మ పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్ , అర్చక సిబ్బంది పాల్గొన్నారు.