
చి.ల.సౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహాని శర్మ(Ruhani Sharma).. తన నటనతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ చిత్రంతో మంచి మార్కులే కొట్టేసినప్పటికీ.. ఆ తరువాత పెద్దగా రాణించలేకపోయింది. హిట్, డర్టీ హరి,నూటొక్క జిల్లాల అందగాడు సినిమాల్లో నటించి మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.
ఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలోనూ రుహాని నటించి ఆడియాన్స్ ను మెప్పించింది. అయితే సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా హాట్ అందాల ఆరబోయని ఈ అమ్మడు..సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తోంది.
తాజాగా తెల్లటి చీర కట్టుతో కనుల విందు చేసింది. తెల్ల చీర కట్టి, గులాబీ చేత పట్టి..సిగ్గు పడుతున్నఈ అమ్మడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి సైతం మంచి స్పందన వస్తోంది. ఈ రేంజ్ లో అందమున్న రుహాని శర్మను..స్టార్ హీరోలు, ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
రీసెంట్గా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో నిలిచి ట్రేండింగ్ సెట్ చేసింది.