ఇటీవల ‘కాంతార ఛాప్టర్ 1’తో మరో విజయాన్ని అందుకున్న కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్.. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్‌లో ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తున్న ఆమె.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కనిపించబోతోంది. మణిరత్నం తెరకెక్కించనున్న ప్రేమకథా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. ఇందులో ధృవ్ విక్రమ్ హీరోగా నటించాల్సి ఉండగా.. ఇప్పుడు తన స్థానంలో మరొకరిని ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఆయన రెండు పాటలు రెడీ చేశారట. గత కొన్ని నెలలుగా కొడైకెనాల్‌లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న మణిరత్నం.. స్క్రిప్ట్‌తో పాటు లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ‘సప్తసాగరాలు దాటి’ లాంటి లవ్ ఫ్రాంచైజీతో యూత్‌కు దగ్గరైన రుక్మిణీ.. లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్ అయిన మణిరత్నం డైరెక్షన్‌లో ఎలా కనిపించనుందో అనే ఆసక్తి నెలకొంది.
