అధికార పార్టీ ఎమ్మెల్యే నాకు టిక్కెట్ రాకుండా చేశారు

అధికార పార్టీ ఎమ్మెల్యే నాకు టిక్కెట్ రాకుండా చేశారు

మంచికి చెడుకు జరుగుతున్న GHMC సమరంలో తన విజయం ఖాయమన్నారు బీజేపీ అభ్యర్థి  కిలారి మనోహర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కిలారీ… టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ప్రజలు తనవైపే ఉన్నారని… బీజేపీ తరపున పోటీచేస్తున్న తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

సెట్టింగ్ కార్పొరేటర్ గా ఉన్న తనకు టికెట్ దక్కక పోవడంతో  బీజేపీలో చేరిన కిలారి మనోహర్ ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేవలం ఎమ్మెల్యేతో మనస్పర్ధలు ఉన్నందువల్లనే అధికార పార్టీ ఎమ్మెల్యే  తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తన పక్షాన ఎప్పటికీ ఉండాలని… రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తేల్చి చెప్పారు కిలారి.