జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్​ ప్యాసింజర్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్​, ఎయిర్ కండిషన్డు స్పెషల్​ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని తెలిపింది. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్​ మంగళవారం ట్వీట్ చేశారు. ఏ రూట్లలో ఈ రైళ్లు తిరుగుతాయన్నదానిపై రైల్వే అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సిటీలు, చిన్న టౌన్లకు ఈ సర్వీసుల్ని తిప్పే అవకాశముందని తెలుస్తోంది. కొత్త రైళ్ల వల్ల వలస కూలీలకు కూడా ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్పారు.