
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ దూసుకెళుతున్నారు. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన రుషి సునక్ కంటే ఆమె చాలా ముందున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సర్వేలో రుషి సునక్ కంటే లిజ్ ట్రెస్ ముందంజలో ఉన్నట్టు వెల్లడయ్యింది. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల ప్రకారం ట్రస్‌కు 58 శాతం మంది టోరి మెంబర్ల మద్దతు ఉన్నట్టు తేలింది. మాజీ చాన్స్‌లర్ రుషికి 26 శాతం మాత్రమే మద్దతు దక్కింది.
12 శాతం మంది ఎటూ తేల్చుకోలేదు. మరోవైపు యూగోవ్ పోల్‌లో అన్ని వయసుల వారి నుంచి ట్రస్‌కు సపోర్ట్ లభించింది. యూగోవ్ పోల్ తో ట్రస్ 38 పాయింట్ల లీడ్‌లో ఉన్నారు. ఆమె ప్రత్యర్థులు, ఎటు తేల్చుకోలేని వారి సంఖ్య 16 పాయింట్లుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుషి గెలవాలంటే అద్భుతం జరగాల్సి ఉందని పరిశీలకు భావిస్తున్నారు. మాజీ వైద్య శాఖ మంత్రి సాజిద్ జావెద్ చివరి నిమిషంలో ట్రస్‌కు మద్దతు తెలిపి రుషికి షాకిచ్చారు.