మరోసారి కాలిబర్ క్షిపణులు ప్రయోగించిన రష్యా

మరోసారి కాలిబర్ క్షిపణులు ప్రయోగించిన రష్యా

ప్రపంచంలోని అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నా తూచ్ అంటూ ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా ఇవాళ మరోసారి కాలిబర్ క్షిపణులు ప్రయోగించింది. నల్లసముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ పై కాలిబర్ క్షిపణులు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక ఆయుధాల డిపో ధ్వంసం అయిందని రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. సైనిక చర్య పేరుతో గత ఫిబ్రవరి నెల 24వ తేదీ నుంచి ఉక్రెయిన్ పై భీకర బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా.అనేక దేశాలు రష్యాను వ్యతిరేకిస్తూ మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ సర్కారు వెనక్కి తగ్గట్లేదు.
24 గంటల వ్యవధిలో 117 సైనిక లక్ష్యాలు ధ్వంసం చేశాం: రష్యా
సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తుంది రష్యా. అనేక దేశాలు రష్యాను వ్యతిరేకిస్తూ మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ సర్కారు వెనక్కి తగ్గట్లేదు.ఉక్రెయిన్ పై చేపట్టిన సైనిక చర్యలో మొదటి దశ పూర్తయ్యిందని రష్యా రక్షణశాఖ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈస్ట్ ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంత స్వాధీనంపై రష్యా దృష్టి సారిస్తున్నామని, ఉక్రెయిన్ లో చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ విషయంలో రెండు ఆప్షన్ లను పరిశీలిస్తున్నాని..ఒకటి.. డాన్ బాస్ లోని వేర్పాటువాద ప్రాంతాల్లోనే దాడులు చేయడం. మరొకటి..ఉక్రెయిన్ మొత్తానికి విస్తరించడం అని స్పష్టం చేసింది. గత 24 గంటల వ్యవధిలో 117 సైనిక లక్ష్యాలు ధ్వంసం చేశామని, మూడు విమానాలతోపాటు ఆరు కమాండ్ పోస్టులు ధ్వంసం అయ్యాయని రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కొవా షెంకోవ్ తెలిపారు.

 

 

 

ఇవి కూడా చదవండి

RRR ఓ మాస్టర్ పీస్.. ఆ మూవీ ఒక అగ్నిపర్వతం

కేసీఆర్ 3 గంటలే పడుకుంటాడు

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు