రష్యా తొలికరోనా వ్యాక్సిన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్పుత్నిక్ పేరుతో తయారైన వ్యాక్సిన్ ను తన కుమార్తెకు వేయించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలిదేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్.. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు తెలిపారు.
రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతీఒక్కరి ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మరాస్కోను ఆదేశించారు.
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఆగస్ట్ నెలలోనే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని.. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని ప్రకటించారు.
