సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను ఆమోదించిన రష్యా

సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను ఆమోదించిన రష్యా

రష్యా మరో వ్యాక్సిన్‌ తీసుకొచ్చినట్టు ప్రకటించింది.కరోనా నివారణకు సంబంధించి సింగిల్‌ డోస్ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ను  ఆమోదించినట్టు తెలిపింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కు చెందిన ఈ సింగిల్-డోస్  స్పుత్నిక్ లైట్  విప్లవాత్మకమైందని.. 80 శాతం సామర్థ్యంతో  పనిచేస్తుందని  రష్యా అధికారులు తెలిపారు. రెండు డోస్ ల వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ లైట్ టీకా చాలా ఎఫెక్ట్ గా ప్రభావం చూపుతుందని  ప్రకటించారు.


రష్యా గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 79.4 శాతం మెరుగ్గా ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది.  స్పుత్నిక్ లైట్ మోతాదుకు 10 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 28 రోజుల  డేటా ప్రకారం ఇది 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని  అధికారికంగా తెలిపింది.


ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న సమయంలో సింగిల్‌ డోసు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో.. ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్‌ అందించే అవకాశం ఏర్పడుతుంది.