కీవ్ సిటీకి 15కిమీ దూరంలో రష్యా సేనలు

కీవ్ సిటీకి 15కిమీ దూరంలో రష్యా సేనలు

ఉక్రెయిన్​ డిఫెన్స్​ను కకావికలం చేసేందుకు రష్యా అన్నిరకాలుగా ప్రయత్ని స్తోంది. కీవ్​తో పాటు ప్రధాన నగరాలపై దాడులు పెంచింది. ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మూడు వారాలు పూర్తయి నా సాధ్యంకాక పోవడంతో రష్యాలో అసహనం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు దాడులు పెంచింది. కీవ్​ సిటీపై బాంబు ల వర్షం కురిపించడంతో 12అంతస్తుల బిల్డింగ్​లో మంటలు చెలరేగా యి. చుట్టుపక్కల బిల్డింగ్​లకూ నిప్పంటుకుంది. కీవ్​ సిటీకి ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్​ నుంచి యూరోప్ దేశాలకు శరణార్ధులుగా చేరుకున్న వారి సంఖ్య 30 లక్షలు దాటింది. ఉక్రెయిన్​లో పరిస్థితులపై చర్చించేందుకు నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులు బుధవారం బ్రెసెల్స్​లో సమావేశమయ్యారు.