ప్రధాని మోడీతో రష్యా విదేశాంగ శాఖ మంత్రి భేటీ

ప్రధాని మోడీతో రష్యా విదేశాంగ శాఖ మంత్రి భేటీ

ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి చేరుకున్న ఆయన.. శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‎తో సమావేశం కానున్నారు. రష్యా, భారత్ సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా.. మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ పై దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇండియా మరోసారి కోరనుంది. శాంతిచర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంతర్జాతీయ వేదికలపై భారత్ పదేపదే చెబుతోంది. 

For More News..

ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం వాయిదా

కేసీఆర్‎ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు

భారీ సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్‎లోనే 8 సినిమాలు

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు