ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం వాయిదా

ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం వాయిదా

రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‎కు స్వల్ప ఊరట లభించింది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయడం వల్ల సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు. దాంతో అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా ప్రయత్నించేందుకు ఇమ్రాన్ ఖాన్‎కు మరింత సమయం దొరికింది.  

కాగా.. సభ వాయిదా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే పార్లమెంట్‎ను రద్దు చేస్తానని ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించలేదు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా.. సాధారణ మెజారిటీకి 172 మంది సభ్యుల మద్ధతు అవసరం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మిత్రపక్షాలతో కలిసి.. 176 మంది సభ్యుల బలం ఉంది. అయితే వీరిలో 25 మంది సభ్యులు ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఇరకాటంలో పడింది. 

మరోవైపు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలన్నదే తన ఉద్దేశం అన్నారు. దేశం అగ్రస్థానంలో ఉండటాన్ని చూశానని.. మన అభివృద్ధిని చూసేందుకు ఉత్తరకొరియా లాంటి దేశాలు ఇక్కడకు వచ్చాయని తెలిపారు.

For More News..

కేసీఆర్‎ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు

ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు

భారీ సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్‎లోనే 8 సినిమాలు

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు