ఆత్మనిర్భర్ అంటే ఏంటో రష్యా చూపించింది

ఆత్మనిర్భర్ అంటే ఏంటో రష్యా చూపించింది

మన ప్రభుత్వం మాటలకే పరిమితమైంది: సంజయ్రౌత్

ముంబై: ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ను తీసుకురావడం ద్వారా రష్యా ఆత్మనిర్భర్ (సెల్ఫ్ రిలయన్స్) అంటే ఏమిటో చూపించిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కానీ మన దేశంలో ఆత్మనిర్భర్ గురించి ప్రభుత్వం మాటలు చెప్పడానికే పరిమితమైందని ఆరోపించారు. శివసేన పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ లో ఆయన ఈ కామెంట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ తీసుకొచ్చారని, తన కూతురుపై కూడా దానిని ప్రయోగించారని రౌత్ చెప్పారు. ప్రపంచమంతా రష్యా వ్యాక్సిన్ ఇల్లీగల్ అని ప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. పుతిన్ తన కుమార్తెపై వ్యాక్సిన్ ట్రయల్ నిర్వహించడం ద్వారా తమ దేశం ఆత్మ విశ్వాసాన్ని చూపించారని అన్నారు.