
- రాజధాని కీవ్ లో ఇద్దరు మృతి.. 16 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భీకర దాడులకు దిగింది. 18 మిసైళ్లు, 400కు పైగా డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. మూడేండ్లుగా కొనసాగుతున్న వార్‌లో అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నాన్ స్టాప్‌గా 10 గంటల పాటు దాడులు చేస్తూనే ఉన్నది.
కీవ్‌తో పాటు మొత్తం 9 డిస్ట్రిక్స్ను లక్ష్యంగా రష్యా అటాక్ చేసింది. దాడిలో రెసిడెన్షియల్ బిల్డింగ్లు, గోదాములు, ఆఫీసులు, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్లు దెబ్బతిన్నాయి. కీవ్‌లోని షెవ్‌చెంకివ్‌స్కీ డిస్ట్రిక్‌లో ఒక అపార్ట్‌మెంట్ భవనం పైభాగంలో శిథిలాలు పడటంతో బిల్డింగ్ దెబ్బతిన్నది. హోలోసివ్‌స్కీ డిస్ట్రిక్‌లో దాడుల కారణంగా ఒక మెడికల్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. స్వియాటోషిన్‌స్కీ డిస్ట్రిక్‌లో గోదాములు, కార్లు కాలి బూడిదయ్యాయి.
రష్యా దాడులను దీటుగా ఎదుర్కొన్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మొత్తం 711 డ్రోన్లు, 7 మిసైళ్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దాడులు ఆపేందుకు రష్యాపై ఒత్తిడి పెంచాలని పలు దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరారు. కాగా, ఒక్క జూన్ లోనే 232 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. 1,343 మంది గాయపడ్డారు. మూడేండ్లుగా కొనసాగుతున్న వార్‌లో జూన్‌లోనే ఎక్కువ మంది చనిపోయారు. జూన్ 1న తమ ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ అటాక్ చేసినట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా వెపన్స్
ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను అమెరికా మళ్లీ ప్రారంభించింది. వారం రోజుల పాటు వెపన్స్ సప్లైను అమెరికా ఆపేసింది. ఉక్రెయిన్‌కు అమెరికా 155 ఎంఎం ఆర్టిలరీ షెల్స్, హైమార్స్, ఎంఎల్‌ఆర్‌లు, జీఎంఎల్ఆర్ఎస్ (గైడెడ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్) మిసైళ్లను పంపింది. ఉక్రెయిన్‌పై ఇటీవల రష్యా దాడులు చేసింది. వీటిని తిప్పి కొట్టేందుకుగాను ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అమెరికా పంపింది. తమ వద్ద ఎన్ని మిసైళ్లు, డ్రోన్లు ఉన్నాయో లెక్కేసుకునేందుకు కొన్ని వారాల పాటు వెపన్స్ సప్లై ఆపేసినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు. ఇకపై ఉక్రెయిన్‌కు వెపన్స్ సప్లై కొనసాగుతుందని ప్రకటించారు.