ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడులు

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడులు

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడులు
నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు

కీవ్ : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. గురువారం ఉక్రెయిన్ లోని దక్షిణ ప్రాంతమైన ఒడెసాపై డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. ఈ అటాక్ లో నలుగురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ఒడిసా ప్రాంతంతో పాటు నిప్రో సిటీపైనా ఉదయం ఈ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ అటాక్ లో ఒడెసా, నిప్రో సిటీలో మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ లోని నల్ల సముద్రం ద్వారా ఆహారధాన్యాలు, ఎరువులను ఇతర దేశాలకు రవాణా చేసే ఒప్పందాన్ని మరో 4 నెలలపాటు పొడిగించామని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.

కీవ్​పై ప్రయోగించిన మిసైల్ కూల్చివేత

కీవ్ పై రష్యా ప్రయోగించిన 2  మిసైళ్లను ఉక్రెయిన్​ కూల్చివేసింది. గురువారం కీవ్​ ప్రాంతంలోని ఇండ్లపై పడుతున్న రష్యా మిసైల్​పైకి ఉక్రెయిన్ మరో మిసైల్​ను ప్రయోగించి పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

పోలెండ్ పై పడింది మా మిసైల్ కాదు

పోలండ్ పై పడింది తమ మిసైల్ కాదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్  స్కీ అన్నారు. తమ మిలటరీ రిపోర్ట్ ఆధారంగా ఆ మిసైల్ రష్యాదే అని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.