ఉక్రెయిన్​కు ఆయుధాలివ్వడమంటే సంక్షోభాన్ని పొడిగించుడే

ఉక్రెయిన్​కు ఆయుధాలివ్వడమంటే సంక్షోభాన్ని పొడిగించుడే

కీవ్/మాస్కో: ఉక్రెయిన్​కు పశ్చిమ దేశాలు అందించే రాకెట్లు, యుద్ధ ట్యాంకులు, ఇతర వెపన్స్ ను తాము పేల్చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్​కు ఎన్ని వెపన్స్ ఇచ్చినా లాభం ఉండదన్నారు. ఆయుధాలను అందిస్తే.. సంక్షోభాన్ని మరింత కాలం పొడిగించినట్లే అవుతుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్​కు 70 కోట్ల డాలర్ల ప్యాకేజీ కింద రాకెట్లు, హెలికాప్టర్లు, జావెలిన్ యాంటీ ట్యాంక్ వెపన్లు, రాడార్లను అందిస్తామంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రకటనపై ఈ మేరకు ఆదివారం పుతిన్ మరోసారి మండిపడ్డారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై ఆదివారం తెల్లవారుజామున లాంగ్ రేంజ్ మిసైల్స్ తో దాడి చేసినట్లు వెల్లడించారు. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు పంపిన టీ 72 ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికల్స్ ను కీవ్ సమీపంలో ఉంచగా, వాటిని మిసైల్స్ తో పేల్చేసినట్లు తెలిపారు. ఇకపై పశ్చిమ దేశాలు అందించే వెపన్స్​ను పేల్చేయడంపైనా ఫోకస్ పెడతామని చెప్పారు. అయితే, పుతిన్ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి స్పందన రాలేదు. 

320 సోల్జర్ల డెడ్ బాడీల మార్పిడి
ఉక్రెయిన్, రష్యా మధ్య తొలిసారిగా అధికారికంగా సోల్జర్ల డెడ్ బాడీలను మార్చుకున్నట్లు శనివారం ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా అధీనంలో ఉన్న జపోరిజియా రీజియన్ లో చెరో 160 మంది సైనికుల మృతదేహాలను మార్చుకున్నట్లు తెలిపారు. కాగా, డాన్ బాస్ ఏరియాలో రష్యా దాడులను తీవ్రం చేసింది. రైల్వే స్టేషన్లను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. లుహాన్స్క్​లోని సెవెరోడోనెట్స్క్, లిసిచాన్స్క్ సిటీల్లో ఇంకా భీకర పోరాటం జరుగుతోందని యూకే ఆర్మీ 
ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.