అమెరికన్ ఎఫ్-16 జెట్‌‌ను కూల్చేసిన రష్యా.. సంబరాల్లో రష్యా ఎస్-300 డిఫెన్స్ సిస్టమ్ ఆఫీసర్స్

అమెరికన్ ఎఫ్-16  జెట్‌‌ను కూల్చేసిన రష్యా.. సంబరాల్లో రష్యా ఎస్-300 డిఫెన్స్ సిస్టమ్ ఆఫీసర్స్

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ కోసం అమెరికా తయారు చేసి ఇచ్చిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌‌ను రష్యా ఈజీగా కూల్చివేసింది. ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా రెండు మిసైల్స్ ఉపయోగించి తమపై యుద్ధానికి ఉక్రెయిన్ వాడుతున్న ఎఫ్-16 జెట్‌‌ను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యన్ స్టేట్ టీవీకి ఎస్ 300 బెటాలియన్ కమాండర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

" అమెరికన్ ఎఫ్-16 జెట్‌‌ను కూల్చాలనే ఆపరేషన్‌‌ను మేం చాలా కాలంగా ప్లాన్ చేశాం. దాన్ని ట్రాక్ చేసి, ఎదురుచూసి దాడి చేశాం. మా మొదటి మిసైల్‌‌తో దాన్ని డ్యామేజ్ చేశాం. ఆ తర్వాత రెండో మిసైల్‌‌తో ఫైనల్ బ్లో ఇచ్చి పూర్తిగా కూల్చేశాం" అని వివరించారు. "ఎఫ్-16 ఫైటర్ జెట్‌‌ను సూపర్ నేచ్యూరల్(అజేయం) అని ప్రచారం చేస్తున్నారు. కానీ, మా దాడిలో అది కూడా మిగతా టార్గెట్లలా కుప్ప కూలింది. ఆకాశం నుంచి పడిపోయింది" అని ఎద్దేవా చేశారు. 

ఎఫ్-16 ఫైటర్ జెట్‌‌ను కూల్చేసినందుకు తమ సైనికులు సంబరాలు చేసుకున్నారని కమాండర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం రష్యా మీడియాలో వైరల్ అయింది. అయితే, రష్యా వాదనపై ఉక్రెయిన్ సైన్యం ఇప్పటిదాకా స్పందించలేదు. కాగా..గతేడాది మేలో జరిగిన భారత్, -పాకిస్తాన్ ఘర్షణ టైంలోనూ ఎఫ్ -16 జెట్ ను ధ్వంసం చేసినట్లు మన ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అధికారికంగా ప్రకటించారు.