భారతీయులను సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేస్తున్న రష్యా

భారతీయులను సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేస్తున్న రష్యా

మాస్కో: ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా భారతీయుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది రష్యా. ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో తాము ఆధీనం చేసుకున్న ఖార్వివ్ పట్టణం, సుమీ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. భారత్ తోపాటు ఇతర దేశాల విద్యార్థుల తరలింపు కోసం 130 రష్యన్ బస్సులు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించింది రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ హెడ్ కల్నల్ మైఖెల్ మిజెన్సివ్. ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలైనప్పటి నుంచి లక్షా 67 వేల మంది ఉక్రెయిన్లు తమ దేశంలోకి ప్రవేశించారన్నారు రొమేనియా బార్డర్ పోలీసులు. నాలుగు చెక్ పోస్టులతో దాటి మాల్డోవా నుంచి రొమేనియాకు చేరుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ కు అంబులెన్స్ ల రూపంలో సాయం అందిస్తామన్నారు స్థానిక అధికారులు.