
రష్యా ప్యాసింజర్ విమానం పంటపొలాల్లో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటన గురువారం పొద్దున జరిగింది. ఉరల్ ఎయిర్ బస్ A321 అనే విమానం మాస్కో లోని జుకోవ్ స్కీ విమానాశ్రయం నుంచి సింపర్ పోల్ కు బయలుదేరింది. అయితే ఆ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పక్షలు గుంపు విమానానికి ఎదురయ్యాయి. తక్షణమే స్పందించిన పైలట్ ఫ్లైట్ ను పంట పొలాల్లో క్రాష్ ల్యాండింగ్ చేశాడు. టేక్ ఆఫ్ అయిన విమానాశ్రయం నుంచి ప్రమాదం జరిగిన చోటు కిలోమీటరుకు తక్కువ దూరంలో అయిందని రష్యా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 226 మంది ప్యాసింజర్లు ఉన్నారని చెప్పారు. ప్రాణాపాయం జరుగలేదని, అయితే 26మందికి గాయాలయినట్లు తెలిపారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.