పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశం

పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యా ఎయిర్ లైన్స్ ఆదేశం

మాస్కో: ఉక్రెయిన్​పై యుద్ధానికి 3 లక్షల మంది అదనపు సైనిక సమీకరణ ఫైల్​పై రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ సంతకం చేయడంతో.. దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మార్షల్​ చట్టం అమలుచేసే అవకాశం ఉండటంతో.. చాలామంది దేశాన్ని వీడుతున్నారు. దీంతో 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉన్న పురుషులకు టికెట్లు అమ్మొద్దని రష్యన్​ ఎయిర్​లైన్స్​ గురువారం ఆదేశాలు జారీ చేసింది. యువకులు దేశం విడిచి వెళ్లాలంటే రష్యా రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. మార్షల్​ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయని రష్యన్లు భయపడుతున్నారు. ఉక్రెయిన్​లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటించినప్పటి నుంచి రష్యా - ఐరోపా సమాఖ్య మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఆకాశన్నంటుతున్న టికెట్ ధరలు

రష్యా నుంచి బుధవారం ఆర్మేనియా, జార్జియా, అజర్​బైజాన్​తో పాటు కజకిస్తాన్​ వెళ్లే ఫ్లైట్స్​ టికెట్లన్నీ నిమిషాల్లో అమ్ముడుపోయాయి. ఈ కారణంగా పుతిన్​ ప్రభుత్వం, ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉక్రెయిన్​తో యుద్ధం చేయడానికి ఖైదీల సాయంకూడా తీసుకుంటున్నట్టు ‘ది గార్డియన్’ తెలిపింది.