అర్థంపర్థంలేని యుద్ధంలో భాగం కాలేను

అర్థంపర్థంలేని యుద్ధంలో భాగం కాలేను

యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యన్ డిప్లమాట్ రాజీనామా
జెనీవా: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాశ్వతంగా అంతులేని అధికారాలను అనుభవించాలన్న ఉద్దేశంతోనే ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగారని ఐక్యరాజ్యసమితిలో రష్యన్ డిప్లమాట్ బోరిస్ బోండరేవ్ విమర్శించారు. అర్థంపర్థంలేని ఈ యుద్ధంలో తాను ఇంకా భాగం కాలేనంటూ ఆయన యూఎన్ లో రష్యా మిషన్ కౌన్సెలర్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. తాను 20 ఏండ్ల పాటు దౌత్యవేత్తగా పని చేశానని, గతంలో ఎప్పుడూ తన దేశం గురించి ఇంతగా సిగ్గుపడలేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పుతిన్ చేపట్టిన యుద్ధం ఉక్రెయిన్ కు మాత్రమే కాదు.. మొత్తం పశ్చిమ దేశాలకే వ్యతిరేకమని బోరిస్ అన్నారు. రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినందున తనపై దేశద్రోహిగా ముద్ర వేస్తారని, కానీ ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపైనే కాకుండా.. రష్యన్ ప్రజలపై కూడా సీరియస్ క్రైమ్ కు పాల్పడటమేనని విమర్శించారు.