మొదటి సారి జంతువులకు కరోనా వ్యాక్సిన్

మొదటి సారి జంతువులకు కరోనా వ్యాక్సిన్

రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. కార్నివాక్-కోవ్ పేరుతో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ టీకాతో ఆరు నెలల వరకు జంతువులకు వైరస్ రాకుండా రక్షణ లభించనుంది. కార్నివాక్-కోవ్ వ్యాక్సిన్ ను కుక్కలు, పిల్లలు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం ప్రకటించింది. ఇది జంతువులపై ఎఫెక్టివ్ గా పని చేస్తోందన తెలిపింది. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ ఇప్పించేందుకు జనం మొగ్గు చూపుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. కార్మివాక్-కోవ్ ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభించినట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. రష్యా వెటర్నరీ విభాగం 17 వేల డోసులతో ఫస్ట్ విడత పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, త్వరలోనే దాన్ని 50 లక్షలకు పెంచుతామని ప్రకటించింది రష్యా.