ఉక్రెయిన్ బార్డర్ లో భారీగా రష్యా సైనికుల మోహరింపు

ఉక్రెయిన్ బార్డర్ లో భారీగా రష్యా సైనికుల మోహరింపు

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు ఇంకా చల్లారలేదు.ఉక్రెయిన్ బార్డర్ నుంచి రష్యా తన బలగాలను వెనక్కి రప్పించామని చెబుతున్నా..నిజానికి అందుకు విరుద్ధంగా ఉంది. ఉక్రెయిన్ బార్డర్  దగ్గర రష్యా భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ పై వైమానిక దాడులు జరిగే  అవకాశం ఉందని అమెరికా అనుమానిస్తోంది. అందుకే రష్యా సైనికులను సరిహద్దుల్లో మోహరించిందని చెబుతోంది. బార్డర్ లో రష్యాకు చెందిన హెలికాప్టర్లు, ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు, మానవరహిత వైమానిక విమానాలు,ఫైటర్ జెట్లకు సంబంధించిన  శాటిలైట్ చిత్రాలు అమెరికా విడుదల చేసింది. 

మరిన్ని వార్తల కోసం

యూపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ