IND vs NZ: ఇంతకంటే బ్యాడ్ లక్ ఉండదు.. గైక్వాడ్‌కు టీమిండియాలో స్థానం దక్కాలంటే అలా జరగాలి

IND vs NZ: ఇంతకంటే బ్యాడ్ లక్ ఉండదు.. గైక్వాడ్‌కు టీమిండియాలో స్థానం దక్కాలంటే అలా జరగాలి

స్వదేశంలో న్యూజిలాండ్ తో జనవరి 11 నుంచి జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో సెంచరీతో సత్తా చాటినా 15 మంది స్క్వాడ్ లో రుతురాజ్ చోటు దక్కించుకోలేకపోయాడు. బాగా ఆడినా జట్టులో ఎంపిక కాకపోతే ఆటగాడికి కాన్ఫిడెంట్ పోతుంది. ప్రస్తుతం రుతురాజ్ పరిస్థితి అలాగే ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుత రికార్డ్ ఉన్న ఈ మహారాష్ట్ర ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్ లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తేనే:

టీమిండియా వన్డే జట్టు పరిశీలిస్తే బ్యాటింగ్ టాప్, మిడిల్ ఆర్డర్ లో స్థానాలు ఫిక్సయిపోయాయి. కెప్టెన్ గా శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటారు. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించే సాహసం చేయరు. వికెట్ కీపర్ గా రాహుల్ స్థానం ఖాయం. దీంతో ప్లేయింగ్ 11లో చోటు పక్కన పెడితే కనీసం స్క్వాడ్ లో బ్యాటర్లకు చోటు దక్కడం కూడా కష్టమే. ఋతురాజ్ కూడా ఇలాగే జరిగింది. సూపర్ ఫామ్ లో ఉన్నంత మాత్రనా సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టడం జరగని పని. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే రుతురాజ్ కు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. 

Also  Read : ఇండియాలో ఆడతారా..? ఐదుగురు పేసర్లతో బంగ్లాదేశ్

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో గైక్వాడ్ ను ఎంపిక చేశారు. గైక్వాడ్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీతో దుమ్ములేపాడు. 2025, డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని జట్టుకు భారీ అందించాడు. గైక్వాడ్ వన్డే కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 34 ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

తొలి వన్డేలో 8 పరుగులే చేసి నిరాశపరిచిన గైక్వాడ్ రెండో వన్డేలో అద్భుతంగా రాణించాడు. మూడో వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  వైస్ కెప్టెన్ గా అయ్యర్ గాయం నుంచి కోలుకొని భారత జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో గైక్వాడ్ కు పక్కన పెట్టక తప్పలేదు. ప్రస్తుతం భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో బ్యాకప్ బ్యాటర్ అవసరం లేదని సెలక్టర్లు భావించారు. ఈ కారణంగానే అయ్యర్ ఎంట్రీతో గైక్వాడ్ పై వేటు పడింది. గైక్వాడ్ స్థానంలో అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. 

న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్  సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్