నిజామాబాద్ జిల్లాల్లో ఇటుక బట్టీలకు రైతు భరోసా...రూ.కోట్లల్లో వ్యాపారం.. అనుమతులు శూన్యం

నిజామాబాద్ జిల్లాల్లో ఇటుక బట్టీలకు రైతు భరోసా...రూ.కోట్లల్లో వ్యాపారం.. అనుమతులు శూన్యం

నవీపేట్, వెలుగు: నిజామాబాద్ జిల్లాల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మండలానికి 10 నుంచి 15 వరకు ఇటుక బట్టీలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ పనిచేయడానికి ఏపీ, బిహార్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తీసుకొచ్చి వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఏటా కోట్లల్లో వ్యాపారం చేస్తున్న ఇటుక బట్టీల ల్యాండ్స్​కు రైతు భరోసా నిధులు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్​కు చెందిన దమ్మమొల్ల కారణాకర్ రావు,రాజేశ్వరి సర్వే నంబర్ 400p1/2లో ఎకరం 11గుంటలను ఇటుక బట్టీల నిర్వహణకు లీజ్​కు ఇవ్వగా వారికి రైతు భరోసా నిధులు జమైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

అన్ని అనుమతులు ఉంటేనే లైసన్స్.. 

ఇటుక బట్టి ఏర్పాటుకు ముందుగా తహసీల్దార్ నుంచి నాలా కన్వర్షన్, ఫారెస్ట్, లేబర్ ఆఫీస్, ట్రాన్స్ కో, మైనింగ్ అనుమతి పత్రాలు అందజేస్తే గ్రామపంచాయతీ నుంచి సెక్రటరీ లైసన్స్ ఇస్తారు. కానీ చాలా చోట్ల కొత్త లైసెన్స్ లేకుండానే కొందరు పాత లైసన్స్ లపైనే బట్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్టీల్లో పనిచేసే కార్మికులకు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులు ఇప్పించాలి. వారి పిల్లలకు చదువు చెప్పించడానికి చొరవ చూపాలి. కానీ నిర్వాహకులు స్మాల్ ఇండస్ట్రీయల్ పేరుతో లేబర్ ను తక్కువ చూపించి అనుమతులు పొందుతున్నారు. కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు.