- ప్రత్యర్థి చిక్కుడు ప్రభాకర్‌పై 275 ఓట్ల మెజార్టీతో గెలుపు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్.సురేందర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చిక్కుడు ప్రభాకర్‌పై 275 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేందర్‌కు 1,396, ప్రభాకర్‌కు 1,121, ఎల్.రవిచందర్‌కు 929 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా డీఎల్ పాండు (1,227 ఓట్లు), కార్యదర్శులుగా పి.శ్రవణ్ కుమార్ గౌడ్(1,380), కె.నిరంజన్‌రెడ్డి (1,267) విజయం సాధించారు.
అదనపు కార్యదర్శిగా కృష్ణకీర్తనకు రికార్డు స్థాయిలో 2,306 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి పసుపులేని రాధిక (791)పై విజయం సాధించారు. ట్రెజరర్‌గా బాలాజీ బానోత్(803), స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ జయసూర్య(1,647), ఎడుగురు ఎగ్జిక్యూటీవ్ సభ్యులు ఎన్నికయ్యారు.
