అక్టోబర్ 5 నుంచి ఎస్ఏ1 ఎగ్జామ్స్

అక్టోబర్  5 నుంచి ఎస్ఏ1 ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 11 వరకూ సమ్మెటివ్‌‌‌‌‌‌‌‌ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఏ-1)  పరీక్షలు నిర్వహించనున్నారు.  1వ తరగతి నుంచి టెన్త్ వరకూ జరిగే పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఒకటో క్లాస్​ నుంచి ఐదో క్లాస్​ వరకూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటాయి. ఈ నెల 9న ముగుస్తాయి. 6,8 క్లాసులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.  

7వ క్లాస్​కు మధ్యాహ్నం 2గంటల నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు పెట్టనున్నారు. 9వ క్లాస్​కు మధ్యాహ్నం 1.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల దాకా  కొనసాగనున్నాయి. టెన్త్ క్లాసుకు ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎగ్జామ్ ఉంటుంది.  ఈ నెల 30న ఫలితాలు రిలీజ్ చేయాలని, నవంబర్ 1న పేరెంట్స్ మీటింగ్ పెట్టి స్టూడెంట్ల ప్రోగ్రెస్ పై చర్చించాలని అధికారులు సూచించారు.