Saachi movie OTT: తండ్రి బాధ్యతను తీసుకునే కూతురి కథ సాచి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Saachi movie OTT: తండ్రి బాధ్యతను తీసుకునే కూతురి కథ సాచి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

ఓటీటీ అందుబాటులోకి వచ్చాక పెద్ద సినిమా.. చిన్న సినిమా అంటే వ్యత్యాసం పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు సైతం అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి మేకర్స్ కు ఓటీటీలు వరంలా మారాయి. స్టార్స్ తో సంబంధం లేకుండా ఉత్సహవంతులైన మేకర్స్ కు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారాయి ఓటీటీ. అలా ఇటీవల ఓటీటీకి వచ్చిన సినిమా సాచి. నిజజీవితం సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ మూవీ గత మార్చిలో థియేటర్స్ లోకి వచ్చింది. 

కానీ, చిన్న సినిమాగా వచ్చి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేయకపోవడంతో ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా జనాలకు గుర్తులేదు. దాదాపు 9 నెలల తరువాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతానికి భరత్ లో తప్ప మిగతా అన్ని దేశాల్లో అందుబాటులో ఉంది ఈ మూవీ. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగులో కూడా రానుంది. 

ఇక సాచి సినిమా విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. బార్బర్ షాప్ నడుపుకునే ఒక తండ్రి. అతనికి ముగ్గురు కూతుళ్లు. దయనీయమైన స్థితి. అయినప్పటికి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు ఆ తండ్రి. అనుకోని విధంగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ జబ్బు ఉందని తెలుస్తుంది. అలాంటి సమయంలో కుటుంబం, తండ్రి బాధ్యతను తీసుకున్న కూతురు సాచి.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఆమెను సమాజం ఎలా చూసింది? అనేది మిగిలిన కథ. చాలా సహజంగా సాగే ఈ కథకు కథనం మైనస్ పాయింట్ గా మారింది. సహజత్వం గురించి ఆలోచింది.. బాగా సాగదీశారేమో అని అనిపిస్తుంది. మరి థియేటర్స్ లో వచ్చినట్టు కూడా గుర్తులేని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.