అయ్యప్పను దర్శించుకున్న 29 లక్షల మంది భక్తులు

అయ్యప్పను దర్శించుకున్న 29 లక్షల మంది భక్తులు

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం.. ఆదాయంలో ఆల్‌‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది జరిగిన మండల పూజ సీజన్​లో మొదటి 39 రోజుల్లోనే రూ. 222.98 కోట్ల ఇన్ కమ్ వచ్చినట్లు ట్రావెన్‌‌కోర్‌‌ దేవస్వం బోర్డు(టీడీబీ) మంగళవారం వెల్లడించింది. అయ్యప్ప ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటి సారి అని చెప్పింది. 41 రోజుల పాటు సాగిన ఈ సీజన్‌‌లో  29.08 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీడీబీ వివరించింది.

ఆలయం మూసివేత

నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు 41వ రోజైన మంగళవారం ప్రత్యేక పూజల నిర్వహించి అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు.  మూడు రోజుల తరువాత అంటే డిసెంబర్ 30 న సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆలయం తెరుస్తారు.