రేపు ఎంసెట్‌ ఫలితాలు

రేపు ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈనెల 12న విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. గత నెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్, 30, 31వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్ ఎగ్జామ్ కు 1,56,812 మంది హాజరయ్యారు. 80 వేల 575 మంది అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్ష రాశారు. ఇప్పటికే ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించింది.

ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జూలై 14, 15వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండే. భారీ వర్షాల కారణంగా జూలై 18, 19, 20వ తేదీల్లో రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.