
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఏ తప్పు చేయకపోయినా ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టు మెట్ల ఎక్కామని అప్పుడు బాధ కలిగిందన్నారు. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం కలుగుతుందని నమ్మానని.. ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు. కానీ పన్నెండున్నర ఏళ్ళు అనేక అవమానాలు భరించానని.. ఎన్నికల సమయంలో అవినీతిపరురాలు అంటూ ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు సంపూర్ణంగా నన్ను నమ్మి గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ళు నాకు అండగా ఉండి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పుతో భారత న్యాయ వ్యవస్థలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం మరోసారి కలిగిందన్నారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం (మే 6) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు మరో నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఏ తప్పు చేయకపోయినా ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టు మెట్ల ఎక్కామని అప్పుడు బాధ ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. 2004 నుంచి 2009 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో సబితా గనుల శాఖ మంత్రిగా పని చేశారు. సబితా హాయాంలోనే ఓబులాపురం మైనింగ్ స్కామ్ వెలుగు చూడటంతో సీబీఐ అధికారులు ఆమెను కూడా కేసులో నిందితురాలిగా చేర్చారు.