IPO News: గ్రేమార్కెట్లో ఐపీవో రికార్డులు.. 3వ రోజు సబ్‌స్క్రిప్షన్ కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు..

IPO News: గ్రేమార్కెట్లో ఐపీవో రికార్డులు.. 3వ రోజు సబ్‌స్క్రిప్షన్ కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు..

Sacheerome IPO: చాలా గ్యాప్ తర్వాత తిరిగి దేశీయ స్టాక్ మార్కెట్లలో మెుదలైన ఐపీవో కోలాహలం కొంత నెమ్మదిగానే కొనసాగుతోంది. అమెరికా వాణిజ్య యుద్ధం తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్లలో వస్తున్న అనూహ్య పరిణామాలతో కంపెనీలు కొంత నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం ఐపీవోలను ఆధరించటం కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సచీరోమ్ కంపెనీ ఐపీవో గురించే. ఈ కంపెనీ రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం జూన్ 9 నుంచి 11 వరకు అందుబాటులో ఉంచింది. అయితే నేడు చివరి రోజు కావటంతో భారీగా పెట్టుబడిదారులు కంపెనీ ఐపీవో కోసం బెట్టింగ్ వేశారు. దీంతో ఐపీవో 81 రెట్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ చూసింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 76.89 సార్లు, నాన్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కేటగిరీ 185.67 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కేటగిరీ 9.53 సార్లు బెట్టింగ్స్ చూసింది.

ALSO READ | Stocks to Buy: బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్.. 38% వరకు లాభాలు..

కంపెనీ ఐపీవో కోసం తన స్టాక్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.96 నుంచి రూ.102గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఏకంగా రూ.47 ప్రీమియం పలుకుతున్నాయి. అంటే ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే స్టాక్ ఒక్కోటి రూ.149 వద్ద మార్కెట్లో జాబితా అయ్యే అవకాశం ఉంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.61.62 కోట్లను సమీకరించే లక్ష్యంతో వస్తోంది. ఇందుకోసం కంపెనీ పూర్తిగా 60.41 లక్షల తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో జాబితా కానున్నాయి. 

కంపెనీ వ్యాపారం..
1992లో స్థాపించబడిన కంపెనీ సువాసనలు, ఫ్లేవర్స్ తయారీ, అభివృద్ధి వ్యాపారంలో ఉంది. కంపెనీ కాస్మెటిక్ కంపెనీలు, ఎఫ్ఎంసీజీ సంస్థలకు, ఫుడ్ ఇండస్ట్రీకి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. అలాగే కంపెనీ తన ఉత్పత్తులను ఆఫ్రికాతో పాటు యూఏఈ దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.