
ముంబై: వరల్డ్‌లో మోస్ట్ అడ్మైర్డ్ (ఎక్కువ ఆరాధించబడే) పర్సన్స్‌లో ఇండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్‌కు ప్లేస్ దక్కింది. ‘యుగోవ్’ అనే ఆర్గనైజేషన్ ఇంటర్నెట్‌లో చేపట్టిన ఓ సర్వేలో వరల్డ్‌వైడ్‌గా మాస్టర్‌కు 12వ ప్లేస్ లభించింది. స్పోర్ట్స్ పర్సన్స్‌లో మాత్రం థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు. సాకర్ సూపర్ స్టార్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ముందు వరుసలో ఉన్నారు. మొత్తం 38 దేశాల నుంచి 42 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే సచిన్ ముందున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.