న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌తోపాటు ఆయనకు సహకరించిన 18 మంది ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిస్‌క్వాలిఫికేషన్ నోటీసు పై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రెబల్ లీడర్ సచిన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అత్యున్నత ధర్మాసనంలో అనర్హత నోటీసుపై చాలెంజ్ చేయాలని తన లాయర్స్‌తో సచిన్ చర్చిస్తున్నట్లు తెలిసింది.
ఆ నోటీసుల్లో ఎలాంటి చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదని, గెహ్లోత్ సర్కార్ ఆశయాల మేరకే వాటిని జారీ చేశారని కోర్టును ఆశ్రయించాలని పైలట్ యోచిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇతర రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులపై ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరడానికి యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ అప్పీల్ మేరకు అనర్హత నోటీసులను సచిన్ పైలట్‌తోపాటు ఆయన క్యాంపు ఎమ్మెల్యేలకు పంపినట్లు స్పీకర్ సీపీ జోషి ధ్రువీకరించారు.
