హైదరాబాద్లో హాఫ్ మారథాన్ రన్.. ప్రారంభించిన సచిన్ టెండూల్కర్

హైదరాబాద్లో హాఫ్ మారథాన్ రన్.. ప్రారంభించిన సచిన్ టెండూల్కర్

హైదరాబాద్ : హాఫ్ మారథాన్ 2023కు హైదరాబాద్ మరోసారి వేదికైంది. గచ్చిబౌలీ స్టేడియంలో హాఫ్ మారథాన్ రన్ ని క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ జెండా ఊపి ప్రారంభించారు. భారత్ లో మొదటి సారి జరుగుతున్న 50 కిలోమీటర్ల  ఆల్ట్రా రన్నింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు  హైదరాబాద్  ఆతిథ్యమిచ్చింది. మొత్తం 22 దేశాలకు చెందిన 150 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఆల్ట్రా రన్నింగ్ ఈవెంట్ లో భాగంగా 50km తో పాటు 21.1km హాఫ్ మారథాన్, 10k, 5k  రన్ ని నిర్వహించారు..  ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ట్రా రన్నర్స్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో మెగా ఈవెంట్ ని NEB స్పోర్ట్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా క్రికెట్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. 

ఈ మారథాన్​లో దాదాపు 8వేలమంది రన్నర్లు పాల్గొన్నారు. ఎన్​ఈబీ స్పోర్ట్స్​ ఆధ్వర్యంలో ఈ మారథాన్​ను ​మూడు విభాగాలుగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్ లో  21.1కిలోమీటర్ల మారథాన్ ఉదయం 5:15 గంటలకు ప్రారంభించారు. 10కే రన్​ 6:30కి, 5కే రన్ ఉదయం 7గంటలకు ప్రారంభించారు.