ద్రవిడ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అవుతాడు

ద్రవిడ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అవుతాడు

హైదరాబాద్: టీమిండియా కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ సక్సెస్​ అవుతాడని లెజెండ్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ సచిన్​ టెండూల్కర్​ అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్​ కోచ్​ అవ్వడం శ్రీలంక టూర్​లో జట్టుకు చాలా హెల్ప్​ అవుతుందన్నాడు. లంకలో పర్యటించే ధవన్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని టీమ్‌‌‌‌‌‌‌‌కు ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సచిన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. ‘లంక టూర్​కు వెళ్తున్న ప్లేయర్లు.. ద్రవిడ్​తో ఇప్పటికే చాలా టైమ్​ స్పెండ్​ చేశారు. అతను ఏంటో వాళ్లకు బాగా తెలుసు. అదే సమయంలో ప్రతీ ప్లేయర్​పై రాహుల్​కు మంచి అవగాహన ఉంది. జట్టుతోపాటు డ్రెస్సింగ్​ రూమ్​లో మంచి వాతావరణం ఉంచగలిగిన వాడే సిసలైన కోచ్​. రాహుల్​ ఆ పనిలో సక్సెస్​ అవుతాడని నాకు నమ్మకముంది.  ఇంటర్నేషనల్ లెవెల్​లో ఆడుతున్న ప్లేయర్లకు కొత్తగా కోచింగ్​ ఇవ్వాల్సిన పని లేదు. కవర్​ డ్రైవ్​ ఎలా ఆడాలో ఔట్​ స్వింగర్​ ఎలా వేయాలో ఇప్పుడు కొత్తగా నేర్పించనవసరం లేదు. వారి ఆటలో ఏదైనా లోపం ఉంటే  మాత్రం కోచ్ బాధ్యత తీసుకుని పరిష్కరించాలి. శిఖర్​ ధవన్​ పదేళ్లకు పైగా ఇంటర్నేషనల్​ క్రికెట్​లో ఉన్నాడు. కావాల్సినంత అనుభవం సంపాదించాడు. జట్టును బాగా హ్యాండిల్​ చేస్తాడని అనుకుంటున్నా. లంక టూర్​కు వెళ్లే టీమ్​ యంగ్​స్టర్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతో సమతూకంగా ఉంది. వీరికి రాహుల్​ ద్రవిడ్​ అండగా ఉండటం మరింత హెల్ప్​ అవుతుంది’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. కాగా, నవోమి ఒసాకా, విరాట్​ కోహ్లీ వంటి వారు  మెంటల్ హెల్త్​ ఇష్యూస్​పై బహిరంగంగా మాట్లాడటం మంచి విషయమన్న మాస్టర్​.. ఆ అంశంపై మరింత చర్చ జరిగితేనే పరిష్కారం దొరుకుతుందన్నాడు. ఏ అథ్లెట్​కైనా ఫిజికల్‌‌‌‌‌‌‌‌తో పాటు మెంటల్​ హెల్త్​ కూడా ముఖ్యమని వివరించాడు. 

హెల్త్​ విషయంలోనిర్లక్ష్యం వద్దు..

ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై  దృష్టిసారించాలని, హెల్త్​ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని సచిన్​ సూచించాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా సచిన్ బుధవారం సోషల్​ మీడియాలో ఓ వీడియో పోస్ట్​ చేశాడు. జిమ్​లో వర్కౌట్స్ చేస్తూ  కనిపించాడు. ‘ఈ రోజు ఒలింపిక్​ డే. ఒలింపిక్ గేమ్స్​లో తమ బెస్ట్​ ఇచ్చేందుకు మన అథ్లెట్లు ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. అదే విధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ రోజు వర్కౌట్స్​ చెయ్యాలి. అలా చెయ్యడం ద్వారా మనం ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉంటాం’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.