
ముంబై: టీమిండియా మరో వరల్డ్‌కప్ సాధిస్తే చూడాలని ఉందని బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కొత్త కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్ బాగుంటుందని, ఈ ఇద్దరూ ట్రోఫీ సాధిస్తే మరింత సంతోషంగా ఉంటుందన్నాడు. ‘ఇండియా టీమ్ వరల్డ్‌కప్ నెగ్గి 11 ఏళ్లు అవుతోంది. బీసీసీఐ క్యాబిన్‌లో మరో ట్రోఫీ కోసం నాతో పాటు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క ట్రోఫీ కోసమే క్రికెటర్లు ఆడుతుంటారు. వరల్డ్‌కప్ అంటేనే సమ్‌థింగ్ స్పెషల్. రోహిత్, ద్రవిడ్‌కు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కప్ సాధిస్తే చాలా మంది కల నెరవేరుతుంది’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.