Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్

Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం మెదడులో రక్త గడ్డకట్టడంతో డాక్టర్లు ఆయనకు అత్యవసర సర్జరీ నిర్వహించారు. సర్జరీ అనంతరం కోలుకున్న సద్గురు బుధవారం (మార్చి 27) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 17న బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో సద్గురును అత్సవసర చికిత్స కోసం ఢిల్లీలో  ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్చారు.  

మార్చి 15న సద్గురుకు MRI స్కాన్ చేయించారని, మెదడులో రక్తం గడ్డ కట్టిందని ఈషా ఫౌండేషన్  తెలిపింది.  తీవ్రమైన తలనొప్పి కారణంగా సద్గురును ఆస్పత్రిలోచేర్చారు.అనంతరం ఇంద్ర ప్రస్థ అపోలో ఆస్ప్రత్రిలో సద్గురు మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రాణాపాయ స్థితిను అధ్యాత్మిక గురువు బయటపడ్డారని సద్గురు కు ఆపరేషన్ చేసిన వైద్యులు తెలిపారు. 

ఈశా ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ పరిరక్షణ కోసం సేవ్ సాయిల్, ర్యాలీ ఫర్ రివర్స్ వంటి కార్యక్రమాలను చేపట్టారు సద్గురు వాసుదేవ్.