వానలు పడ్తున్నాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

వానలు పడ్తున్నాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  అయితే ఈ వర్షాల కారణంగా  కొంత అనారోగ్యం ఏర్పడుతుంది.    ఇందుకోసం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి రోగం మనల్ని దరి చేరకుండా ఉంటుందని కొందరు ఆరోగ్యనిపుణులు సలాహాలు ఇస్తున్నారు.ఈ వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లను అరికట్టడంలో సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

1.  ఎక్కువగా వర్షంలో తడవకుండా ఉండడం వలన చాలా వరకు మీరు కొన్ని రకాల వ్యాధుల నుండి  బయట పడవచ్చు.

2.   జలుబు, దగ్గు చిన్న పాటి జ్వరం వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతి రోజూ ఎక్కువ సార్లు బాగా కాచి వడపోసిన నీటిని తాగుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులలో మంచి నీటిని డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది కాదు.

3. సీజన్‌తో సంబంధం లేకుండా ఇది ఎప్పుడూ పాటించాల్సిన ఒక ముఖ్యమైన చిట్కా. వంట చేయడానికి ముందు, కూరగాయలు, పండ్లను బాగా కడగాలి.  అవి దుమ్ము, ధూళి, హానికరమైన బ్యాక్టీరియాకు గురవుతాయి. ఇవి వైరల్ జ్వరం, ఇన్ఫెక్షన్‌లను కలిగిస్తాయి.

4.  ఆహారపు అలవాట్లను కూడా కొంచెం మార్చుకోండి... వేడి పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి.ఆహారాన్ని ఫ్రెష్ గా ఉంచుకోండి.  నిల్వ ఉన్న పదార్ధాలను తింటు ఇన్ ఫెక్షన్ వచ్చి రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.

 5. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కాబట్టి బయటి ఆహారాన్ని తినడం మానుకోండి. కట్ చేసిన పండ్లను వెంటనే తినేయండి. నిల్వ ఉంచుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

6.నీరు నిల్వ ఉండకుండా  మీ చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.   దీంతో కొంతవరకు వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. భోజనానికి ముందు, తర్వాత వేడి నీళ్లతో చేతులు కడుక్కోంది.  

7.   వైరల్ జ్వరం అంటువ్యాధి. మీరు ఇప్పటికే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లయితే లేదా జలుబు లేదా దగ్గుతో బాధపడుతుంటే, మీ ఆహారం, పానీయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారడానికి కొన్ని సూక్ష్మక్రిములు మాత్రమే అవసరం.జ్వరం వచ్చి రెండు రోజుల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

8.  ముఖ్యంగా వర్షాకాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం చాలా ప్రమాదం.

9. వేడి సూప్‌లు, పులియబెట్టిన ఆహారాలు, ఎండిన పండ్లు, గింజలు, ఆకు పచ్చని కూరగాయలు వంటి కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలతో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. ఫ్లూ వ్యాక్సిన్‌ని పొందండి