సాగర్ బైఎలక్షన్‌ నామినేషన్ గడువు మరో మూడురోజులే

సాగర్ బైఎలక్షన్‌ నామినేషన్ గడువు మరో మూడురోజులే

నాగార్జునసాగర్ బైఎలక్షన్‌కు గడువు మరో మూడు రోజులే ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కరోనాతో అకాల మరణం చెందడంతో సాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించింది. అయితే ఈ నెల 27,28,29 తేదీలను ఈసీ సెలవులుగా పరిగణించడంతో.. ఆ మూడు రోజులు నామినేషన్లు తీసుకోరు. ఇక మిగిలింది చివరి రోజైన 30వ తేదీ. కాబట్టి అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ లేకపోతే 30వ తేదీన తమతమ నామినేషన్లను సమర్పించాల్సిందిగా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, vigil app ద్వారా తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తామని.. ఏప్రిల్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఆయన తెలిపారు. ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహించి.. మే రెండో తేదీన కౌంటింగ్ చేస్తామని ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు 11 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన తెలిపారు. కాగా.. టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలో ఉండటం గమనార్హం.