
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్(Sai Dharam) కాంబో లో వస్తోన్న మూవీ 'BRO'. ఈ మూవీ రేపు జూలై 28న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తన మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఇబ్బందికరంగా ఉంది. దీంతో రేపు రిలీజ్ అయ్యే బ్రో మూవీ నేపథ్యంలో ఏ ఒక్క అభిమానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'ఇప్పటి వరకు ఈ మూవీకు సంబంధించని పోస్టర్స్, సాంగ్స్, ప్రతి ఒక్క అప్డేట్ కు ఎంతో ప్రేమను అందించారు. ఎప్పటికప్పుడు మాపై మీ ప్రేమను పలు విధాలుగా పంచుతూనే ఉన్నారు. మీరు ఇష్టంగా చేసుకునే ప్రతి సెలబ్రేషన్ ను కాదనలేము. ఇకపోతే ఇటువంటి వాతావరణ టైం లో మీకైమైన జరిగితే..తట్టుకునేంత ధైర్యం నాకు లేదని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. మీ ప్రేమను పొందటానికి ఎప్పుడు రెడీ గా ఉంటాను. కానీ మీరు సురక్షితంగా ఉండటమే నాకు చాలా ముఖ్యమని ప్రార్ధిస్తూ' సాయి ధరమ్ తేజ్ నోట్ రిలీజ్ చేశారు.
ఈ విషయంపై స్పందించిన సాయి తేజ్ కు ఫ్యాన్స్ అంటే ఎంత ప్రేమో అర్ధం అవుతోంది. దీంతో చాలా హ్యాపీ గా ఉందన్న అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ ప్రధాన పాత్రలు పోషించారు, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిషోర్, రాజా చెంబోలు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.