
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ.. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్‌లు రాబట్టింది. దీంతో ఇటీవలె రూ. 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది.
ఇక థియేట్రికల్ రన్‌లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలోనూ దుములేపుతోంది. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మే 20 శనివారం అర్థరాత్రి నుంచే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు.
సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో.. థియేటర్ లో మిస్ అయినా వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ముదులిపేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.